పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియాడికల్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘలాయిల పరిపాలనా కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ పాన్ – ఇండియా ప్రాజెక్ట్ లో.. రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నాడు పవన్. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం.. ఫిబ్రవరి 4 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ సినిమాలో ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మెయిన్ లీడ్ గా నటించే అవకాశముందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆ అవకాశం సోనాక్షి సిన్హాకి దక్కిందని తెలిసింది. అయితే, సోనాక్షి ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, 2021 సంక్రాంతికి `పీకే 27` (పవన్ కళ్యాణ్ 27వ చిత్రం) థియేటర్లలో సందడి చేసే అవకాశముంది.
[custom_ad]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























