అల‌నాటి హిట్ చిత్రం ఆధారంగా `ట‌క్ జ‌గ‌దీష్‌`?

Tuck Jagadish Is The Makeover Of That Old Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Telugu Movie Latest News,Tuck Jagadish Movie Live Updates,Hero Nani Tuck Jagadish Live Updates

`నిన్ను కోరి`, `మ‌జిలీ` రూపంలో రెండు వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌.. ఇప్పుడు త‌న త‌దుప‌రి సినిమాని నేచుర‌ల్ స్టార్ నానితో రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. `ట‌క్ జ‌గ‌దీష్` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో జ‌గ‌ప‌తి బాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే… అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి 90ల నాటి ఓ హిట్ మూవీ ఆధార‌మ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇంత‌కీ ఆ చిత్ర‌మేమిటంటే… `బ‌ల‌రామ‌కృష్ణులు`. అగ్ర‌శ్రేణి క‌థానాయ‌కులు శోభ‌న్ బాబు, రాజ‌శేఖ‌ర్ అన్న‌ద‌మ్ములుగా న‌టించిన స‌ద‌రు చిత్రం అప్ప‌ట్లో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది.

[custom_ad]

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. అందులో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు ఈ చిత్రంలో అన్న పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌డం విశేషం. ఏదేమైనా, `బ‌ల‌రామ‌కృష్ణులు` ఆధారంగానే `ట‌క్ జ‌గ‌దీష్` రూపొందుతుందో లేదో తెలియాలంటే మాత్రం స‌ద‌రు సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రంలో నానికి జోడీగా రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.