2 మిలియ‌న్ క్ల‌బ్ లో `అల వైకుంఠ‌పుర‌ములో`

Ala Vaikunthapurramuloo Movie Joins 2 Million Club

ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన `అల వైకుంఠ‌పుర‌ములో` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌లై ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల `నాన్ – బాహుబ‌లి 2` రికార్డుల‌ను సృష్టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఓవ‌ర్సీస్ లోనూ క‌లెక్ష‌న్ల పంట పండిస్తోంది. అంతేకాదు… తాజాగా ఈ సినిమా యు.ఎస్. ఎ బాక్సాఫీస్ వ‌ద్ద 2 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో చేరిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ జాబితాలో చేరిన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ నాలుగో చిత్రం `అల వైకుంఠ‌పురములో` కాగా… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇదే తొలి సినిమా కావ‌డం విశేషం. మ‌రి.. మున్ముందు `అల‌..` ఖాతాలో ఇంకెన్ని రికార్డులు చేరుతాయో చూడాలి.

[custom_ad]

గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన `అల వైకుంఠ‌పుర‌ములో`కి థ‌మ‌న్ బాణీలు అందించాడు. పూజా హెగ్డే నాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో ముర‌ళీ శ‌ర్మ‌, జ‌య‌రామ్, టబు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + five =