ఒకవైపు బుల్లితెర వ్యాఖ్యాతగానూ, మరోవైపు వెండితెరపై నటిగానూ సక్సెస్ ఫుల్ కెరీర్ తో ముందుకు సాగుతోంది అనసూయ. `రంగస్థలం`లోని రంగమ్మ పాత్రతో నటిగా మరోమెట్టు ఎదిగిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ`లో కీలక పాత్రలో నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అంతేకాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రానున్న సినిమాలోనూ కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనుందని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం… ఇందులో అనసూయ నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో దర్శనమిస్తుందని… ఇప్పటివరకు తను పోషించిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో పాత్ర ఉంటుందని తెలిసింది. మరి.. సరికొత్త పాత్రలో అనసూయ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: