ప‌్ర‌ణీత‌… బాలీవుడ్ రేర్ రికార్డ్

Pranitha Subhash Sets A Rare Record In Bollywood

ద‌క్షిణాదిన స్టార్ డ‌మ్ పొందిన ప‌లువురు క‌థానాయిక‌లు బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చారు, ఇస్తున్నారు. అయితే, ఒకే రోజున `డబుల్ ఎంట్రీ` ఇచ్చిన నాయిక‌లు మాత్రం అరుద‌నే చెప్పాలి. అలా… `బాపుగారి బొమ్మ‌` ప్ర‌ణీత ఓ రేర్ రికార్డ్ ని త‌న ఖాతాలో వేసుకోబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ద‌క్షిణాదిన న‌టిగా త‌న‌దైన ముద్ర వేసిన ప్ర‌ణీత… త్వ‌ర‌లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అజ‌య్ దేవ‌గ‌ణ్, సంజ‌య్ ద‌త్, రానా ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న `భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో ప్రణీత ఓ నాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 14న రిలీజ్ కానుంది. క‌ట్ చేస్తే… అదే రోజున ప్ర‌ణీత రెండో హిందీ చిత్రం `హంగామా 2` కూడా రిలీజ్ కానుంది. ద‌క్షిణాది ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ రూపొందిస్తున్న ఈ సీక్వెల్ లోనూ ప్ర‌ణీత ఓ హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌రి… ఒకే రోజున `డ‌బుల్ ఎంట్రీ` ఇవ్వ‌బోతున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి బాలీవుడ్ లో ఎలాంటి ఫ‌లితాలు ద‌క్కుతాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.