ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న కథానాయికల్లో అనుష్క ఒకరు. `అరుంధతి` నుంచి `భాగమతి` వరకు పలు నాయికా ప్రాధాన్య చిత్రాల్లో అలరించింది స్వీటీ. తన కొత్త చిత్రం `నిశ్శబ్దం` కూడా ఇదే బాటలో వెళ్ళనుంది. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ థ్రిల్లర్ మూవీ జనవరి 31న రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… అదే నెలలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళే దిశగా అనుష్క ప్లాన్ చేస్తోందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే… గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అనుష్క ఓ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. తాజా కథనాల ప్రకారం… ఈ మూవీని జనవరి నుంచి పట్టాలెక్కించనున్నారని తెలిసింది. అంతేకాదు… మిలటరీ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇదని… స్వీటీ స్వయంగా పోరాట ఘట్టాల్లో పాల్గొంటుందని టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























