అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాతో వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసారో తెలిసిందే. ఇప్పుడు మరో బోల్డ్ మూవీతో వచ్చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా ‘బ్యూటిఫుల్’. వంగవీటి చిత్రం ద్వారా పరిచయమైన నైనా గంగూలీ అందచందాలు, అభినయం ఇప్పటికే యూత్ ను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి బాగానే రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమా ఆడియో ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
కాగా టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని నూతన సంవత్సరం సందర్బంగా జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు.ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: