యువ కథానాయకుడు నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన చిత్రం `కార్తికేయ` (2014). ఈ సినిమాతోనే చందు మొండేటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. కట్ చేస్తే… ఐదేళ్ళ తరువాత ఈ డివోషనల్ థ్రిల్లర్ కి సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది. `కార్తికేయ` కథ ఎక్కడ ముగిసిందో… అక్కడి నుంచే `కార్తికేయ 2` ప్రారంభం అవుతుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, కుంభమేళా నేపథ్యంలో సాగే ఈ కొనసాగింపు చిత్రాన్ని జనవరి నుంచి పట్టాలెక్కించనున్నారని సమాచారం. అంతేకాదు, చకచకా చిత్రీకరణ జరిపి 2020 సెకండాఫ్ లో రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. `కార్తికేయ`లో నాయికగా నటించిన స్వాతి ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాలో… అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సీక్వెల్ ని నిర్మించనుంది.
మరి… `కార్తికేయ`లాగే `కార్తికేయ 2` కూడా సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: