మల్టీస్టారర్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` మొదలుకుని `వెంకి మామ` వరకు ఐదు మల్టీస్టారర్స్ లో మెస్మరైజ్ చేశారాయన. వీటిలో `మసాలా` మినహా మిగిలిన చిత్రాలన్నీ మంచి ఫలితాల్నే అందించాయి. అయితే, ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ మల్టీస్టారర్స్ తో పలకరించడం, వాటితో బ్లాక్ బస్టర్స్ చూడడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. అది 2019లోనే చోటుచేసుకోవడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఏడాది ఆరంభంలో అంటే జనవరిలో (సంక్రాంతి సీజన్) మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలసి `ఎఫ్ 2` అనే మల్టీస్టారర్ తో సందడి చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ… సంవత్సరాంతంలో అంటే డిసెంబర్ లో (డిసెంబర్ 13… వెంకీ బర్త్ డే) మేనల్లుడు, యువ సామ్రాట్ నాగచైతన్యతో కలసి నటించిన `వెంకిమామ`తో మరో విజయం చూశారు. మొత్తానికి… ఒకే ఏడాదిలో రెండు మల్టీస్టారర్స్ తో పలకరించడమే కాకుండా… బ్లాక్ బస్టర్స్ చూసి `టాక్ ఆఫ్ టాలీవుడ్` అయ్యారు వెంకీ.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: