కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా గమ్మత్తుగా అనిపిస్తాయి. అలాంటి ఓ విషయమే ఇది. యువ సామ్రాట్ నాగచైతన్య, `సుప్రీమ్` హీరో సాయితేజ్ ఈ ఏడాది రెండేసి సినిమాలతో సందడి చేసిన సంగతి తెలిసిందే. విశేషమేమిటంటే… వారిద్దరి నుంచి ఆ రెండు చిత్రాలు కూడా వారం వారం గ్యాప్ లోనే తెరపైకి వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… వేసవిలో చైతూ `మజిలీ`తోనూ, తేజ్ `చిత్రలహరి`తోనూ పలకరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. `మజిలీ` ఏప్రిల్ 5న రిలీజ్ కాగా, `చిత్రలహరి` ఏప్రిల్ 12న థియేటర్లలో సందడి చేసింది. వారం గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరాయి. కట్ చేస్తే… ఈ నెలలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. డిసెంబర్ 13న చైతూ `వెంకిమామ`తో పలకరిస్తే… 20న తేజ్ `ప్రతి రోజూ పండగే` అంటూ జనం ముందుకొచ్చాడు. ఈసారీ కూడా సేమ్ రిజల్ట్స్ రిపీట్ చేశారు. మొత్తానికి… అటు సమ్మర్ లోనూ, ఇటు వింటర్ లోనూ వారం రోజుల వ్యవధిలో వచ్చిన చైతూ, తేజ్… మంచి సక్సెస్ లను చూశారన్నమాట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: