“భలే భలే మొగాడివోయ్ ” , “మహానుభావుడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ ఫేమ్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ప్రతి రోజూ పండగే ” మూవీ ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు మారుతి ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మారుతి దర్శకత్వం లో భారీ చిత్ర నిర్మాత దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి హీరో గా ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ తో కళ్యాణ్ టాలీవుడ్ కు హీరో గా పరిచయం అవుతున్నారు. దర్శకుడు మారుతి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారని సమాచారం. జనవరి లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ వివరాలు త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: