‘మహానటి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిలోభాగంగానే జాతీయ అవార్డు కూడా దక్కిన సంగతి తెలిసిందే. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ ఏడాది ఆగస్ట్ లోనే ప్రకటించారు. అయితే నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మహానటి అవార్డు ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మరో అవార్డ్ ను సొంతం చేసుకుంది కీర్తి సురేష్. దక్షిణాది చలన చిత్రసీమ ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో `మహానటి` చిత్రానికి గానూ కీర్తి సురేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కరాన్ని సొంతం చేసుకుంది.
కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ‘పెంగ్విన్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు కీర్తి అమిత్ శర్మ దర్శకత్వంలో ‘మైదాన్’ సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ లో నటిస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: