బాలీవుడ్ మూవీ లో విజయ్ సేతుపతి

Vijay Sethupathi Plays Villain In A Bollywood Movie

కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96 తమిళ మూవీ ఘనవిజయం సాధించి పలు భాషలలో రీమేక్ జరుపుకుంటుంది. హీరోగా నటిస్తున్న విజయ్ సేతుపతి నాలుగు మూవీస్ లో ప్రతినాయకుడి పాత్రలను ఓకే చేశారు. విజయ్ హీరోగా రూపొందనున్న విజయ్ 64 మూవీ, కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ, తెలుగు లో అల్లు అర్జున్ 20మూవీ , సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఉప్పెన మూవీ లో విలన్ గా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోలీవుడ్, టాలీవుడ్ లలో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ఇప్పుడు బాలీవుడ్ లో ప్రవేశించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయా కామ్ 18 మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై అద్వైత్ చంద్రన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న కామెడీ డ్రామా లాల్ సింగ్ చద్దా మూవీ లో ఒక కీలక పాత్రకు విజయ్ సేతుపతి ఎంపిక అయ్యారు. నటించే సత్తా ఉన్న నటుడికి ఏ భాషా చిత్రమైనా ఒకటే
అని విజయ్ సేతుపతి నిరూపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here