ప్రముఖ నటి గీతాంజలి మృతి పట్ల సుప్రసిద్ధ కథానాయకులు రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.” ఒక సహనటిగా గీతాంజలి నాకు సుపరిచితురాలు. ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం. ఎన్టీ రామారావు గారి ” సీతారామ కళ్యాణం ” తో పరిచయమైన గీతాంజలి హీరోయిన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ నటిగా వందలాది పాత్రల్లో నటించి మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపుపొందారు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యక్రమాలలో కూడా చాలా ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఆమె మరణంతో నేను వ్యక్తిగతంగా ఒక మంచి స్నేహితురాలిని , చిత్ర పరిశ్రమ ఒక మంచి నటిని కోల్పోయినట్లు అయింది. ఆమె కుటుంబ సభ్యులకు
నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” – అన్నారు రెబల్ స్టార్ కృష్ణం రాజు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























