కావాలనే నెగిటివిటీ పెంచారా.. !

Are They Willingly Spreading Negativity On Vithika Sheru?,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vithika Sheru Latest News,Bigg Boss 3 Telugu Contestants vithika,Bigg Boss 3 Telugu Updates

బిగ్ బాస్ సీజన్ 3 ఇంకో మూడు వారాల్లో ముగిసిపోనుంది. మిగిలిన రెండు సీజన్లతో పోల్చుకుంటే.. ఈ సీజన్ ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు అయిపోతుంది అన్నట్టు అయింది. ఇక ఇప్పటికే దాదాపు 11 మంది ఏమినేషన్ అవ్వగా లో ఇంకా హౌస్ లో ఏడుగురు ఉన్నారు. ఇక ఈవారం నామినేషన్ ప్రక్రియ కూడా జరిగిపోయింది. 13వ వారం నామినేషన్‌లో భాగంగా ఈ వారం బిగ్ బాస్ టాపర్ ఆఫ్ ది హౌస్ అనే టాస్క్ ఇచ్చారు. ఎవరి పొజీషన్ ఏంటో వారే తేల్చుకునేలా సెట్ చేశారు. గార్డెన్ ఏరియాలో వరుసగా నంబర్లు ఉన్న కడ్డీలను పెట్టి ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో వారినే తేల్చుకోమని చెప్పారు. దీనితో కంటెస్టెంట్లందరి మధ్య పెద్ద మాటల యుద్ధం చోటు చేసుకుందని చెప్పాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారో అన్నదానిపై ఇప్పటికే ఒక పేరు వినిపిస్తున్న సంగతి కూడా విదితమే. అదే వితిక పేరు. వితికకి వున్నా నెగిటివిటీనే సగం ఆమె ఎలిమినేషన్ కు కారణమని చెప్పొచ్చు. నిజానికి వితిక వన్ అఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. వరుణ్ తో కంపేర్ చేసినా కూడా వితికనే చాలా స్ట్రాంగ్. ఇంకా చాలా మంచి క్వాలిటీసే ఉన్నాయి.

మొదటినుండి టాస్కుల్లో వితిక ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంతే కాదు ప్రతి వీక్ నాగార్జున గారు చెప్పే పాయింట్స్ ను మైండ్ లో పెట్టుకొని .. తనలో ఉన్న మైనస్ లను పాజిటివ్ గా మార్చుకొని.. మొదటి వారాల్లోనే వెళ్తుంది అనుకున్న ఆమె ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. డే బై డే హౌస్ లో ఇంప్రూవ్ అయింది ఎవరంటే వితిక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు మొదటినుండి వారిది వేరే గ్రూప్ అయినా కూడా తాను మాత్రం అందరితో కలిసిపోయి.. అందరితో టైం స్పెండ్ చేస్తుండేది.

* వంట చేసిపెట్టడానికి కూడా వితిక ఎప్పుడూ ముందుంటుంది. ఒక పక్క టాస్క్ జరుగుతున్నా టాస్క్ చేస్తూ.. ఎలాంటి అలుపు లేకుండా మరో పక్క వంట కూడా చేస్తూ అందరికి వండిపెట్టడం మనం చూశాం.
*తనను ఎవరు నామినేట్ చేసినా కూడా ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా స్పోర్టివ్ గా తీసుకున్న రోజులున్నాయి. అంతేకాదు వరుణ్ ని కూడా సరిగా ఆడట్లేదని నామినేట్ చేసిన రోజులున్నాయి.
*టాస్కుల్లో కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా.. స్పోర్టివ్ గా తీసుకుంటూ 100 పెర్సెంట్ అఫర్ట్స్ పెడుతుంది
*కపుల్ గా ఇంట్లో ఎంట్రీ అయినా కూడా తన గేమ్ తాను ఇండివిడ్యువల్ గా ఆడటానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది.
* మెడాలియన్ టాస్క్ లో బాబా భాస్కర్ కు గట్టి పోటీ ఇచ్చి మెడలియన్ గెలిచింది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ ఆ వస్తాయి.

అయితే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక నెగిటివ్ పాయింట్ అనేది ఉంటది. బిగ్ బాస్ హౌస్ లో అంతమందితో.. ఎలాంటి ఫోన్ లు, టీవీ లు లేకుండా.. కేవలం టాస్క్ లు.. వండుకొని తినాలంటే.. చూడటానికి మనకు ఈజీగా ఉన్నా చాలా కష్టం. అలాంటప్పుడు ఒకరిమీద ఒకరు చెప్పుకోవడం కామన్. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆలా వెనుక మాట్లాడినవాళ్ళే కాని.. వితికాది మాత్రమే సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేశారు. అవన్నీ పక్కన పెడితే వితిక టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ వీక్ ఏం జరుగుతుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =