మారుతి దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా.. ఇక ఈ రోజు తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి కొన్ని సన్నివేశాలను వీడియోగా చేసి ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ ప్రతిరోజూ పండగే పేరుతో విడుదల చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో సాయి తేజ్ హీరో సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. సత్యరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా… రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్యశ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా.. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మరి చాలా ప్లాప్స్ తర్వాత తేజ్ కు చిత్రలహరితో ఓ మంచి హిట్ దక్కింది. ఇక మారుతి కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ సినిమాతో మళ్ళీ తేజ్ మంచి హిట్ దక్కుతుందేమో..? చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: