‘అల వైకుంఠపురములో’ సినిమాకి హైలైట్ అదేనట..!

Allu Arjun Ala Vaikunthapurramuloo Movie Interesting Update,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ala Vaikunthapurramuloo Movie Interesting Update,Ala Vaikunthapurramuloo Movie Latest News,Allu Arjun New Movie Updates

స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘సామజవరగమన’ సాంగ్ రిలీజ్ చేయగా.. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం హైలైట్ గా నిలుస్తాయట. అల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సీన్స్ ఒక 10 నిమిషాలపాటు ఉంటాయట. ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయన్న టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ ఎమోషనల్ సీన్స్ ను త్రివిక్రమ్ హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించాడని.. ప్రతి ఒక్కరి మనసులకు ఆ సీన్స్ కనెక్ట్ అవుతాయని చెబుతున్నారు. మరి నిజంగానే ఎమోషనల్ సీన్స్ ను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ చాలా జీనియస్. చూద్దాం ఈ సినిమాలో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో.

కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
మరి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.