విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ నిర్మాణ సారథ్యంలో AL విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తలైవి మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ మూవీ కై కంగనా రనౌత్ తమిళ భాషను నేర్చుకొనడం విశేషం. తలైవి షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లో జయలలిత యంగ్ ఏజ్ లో ఉన్న సన్నివేశాలని తెరకెక్కిస్తారని , తరువాత షెడ్యూల్ నుండి బరువు పెరిగిన కంగన తో చిత్రీకరణ జరుపుతారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తలైవి మూవీ లో M.G రామచంద్రన్ గా అరవింద్ స్వామి, కరుణానిధి గా ప్రకాష్ రాజ్ నటించనున్నారు. 22సంవత్సరాల క్రితం ఇరువురు మూవీ లో కరుణానిధి గా నటించిన ప్రకాష్ రాజ్ మరోసారి ఆ క్యారెక్టర్ లో నటించడం విశేషం. జయలలిత జీవితంలోని ముఖ్య ఘట్టాలతో తలైవి మూవీ తెరకెక్కనుంది. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. తలైవి మూవీ షూటింగ్ రామోజీ
ఫిల్మ్ సిటీ లో నవంబర్ 6వ తేదీ ప్రారంభం కానుందని సమాచారం. తలైవి మూవీ తమిళ భాషతో పాటు తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























