సామ్-రానా లకు ఫిదా పిల్ల ఛాలెంజ్..!

Sai Pallavi Challenges Samantha and Rana Daggubati,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Sai Pallavi challenges Samantha,Sai Pallavi Nominated Samantha and Rana,Sai Pallavi Latest News

‘ఫిదా’ సినిమాతో అందరినీ ఫిదా చేసిన భాన్సువాడ భానుమతి అదే సాయి పల్లవి సమంతకు, రానాకు ఓ ఛాలెంజ్ విసిరింది. ఇంతకు ఆ ఛాలెంజ్ ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. తెలంగాణా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఛాలెంజ్’ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలెబ్రిటీస్ కూడా మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ కూడా తన వంతుగా మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ ను నాగ చైతన్య, వరుణ్ కు విసిరాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అఖిల్ ఇచ్చిన ఛాలెంజ్ ని పూర్తి చేసిన వరుణ్ ఈ ఛాలెంజ్ ను సాయి పల్లవి, తమన్నాలకు విసిరాడు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన సాయి పల్లవి ఓ మొక్క నాటి… దీనికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంత, రానాలకు ఈ ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన రానా.. సాయి పల్లవి పోస్ట్ పై స్పందించి ‘ఆన్ ఇట్ బాస్’ అని రిప్లై ఇచ్చాడు. మరి ఏదో ఐస్ బకెట్.. కి కి ఛాలెంజ్ లాంటివి కాకుండా సమాజానికి పనికొచ్చే ఇలాంటి ఛాలెంజ్ లు చేస్తే బెటర్.

కాగా ప్రస్తుతం రానా, సాయి పల్లవి వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం 1992’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.