పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ నిర్మాత రామ్ చరణ్ ?

Ram Charan to Produce Pawan Kalyan Comeback Movie?,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Pawan Kalyan Comeback Movie,Ram Charan to Produce Pawan Kalyan,Ram Charan New Movie Updates

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రజలలో, అభిమానులలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించకుండా పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టి , ఫుల్ టైమ్ రాజకీయనాయకుడిగా మారిన విషయం తెలిసిందే. సినిమాలను పవన్ కళ్యాణ్ దూరం పెట్టినా, సినీ పండితులు కళ్యాణ్ మూవీస్ లో నటించడం ఖాయం అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాణ సంస్థలు కళ్యాణ్ తో మూవీస్
నిర్మించడానికి పోటీ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కి రామ్ చరణ్ నిర్మాతగా ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందించిన ఖైదీ నెం 150 , సైరా నరసింహా రెడ్డి మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ నిర్మాత గా రూపొందించే మూవీ లో నటించడానికి కళ్యాణ్ సుముఖంగా ఉన్నారనే అభిప్రాయాన్ని చిరంజీవి వెలిబుచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్, హారిక &హాసిని క్రియేషన్స్, AM రత్నం నిర్మించే మూవీస్ కి కళ్యాణ్ కమిటయి ఉన్నారు. అన్నీ సక్రమంగా జరిగితే రామ్ చరణ్ నిర్మాత గా పవన్ కళ్యాణ్ హీరోగా నటించే మూవీ అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here