‘ఆవిరి’ సినిమా టీజర్ రిలీజ్

Ravi Babu Aaviri Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Aaviri Movie Updates,Aaviri Telugu Movie Latest News,Aaviri Movie Teaser,Aaviri Telugu Movie Teaser,Aaviri Official Teaser,#AaviriTeaser

టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు డైరెక్షన్ లో ‘ఆవిరి’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెంచేశాడు రవిబాబు. ‘స్టౌ మీద కొంచెం తెరిచి ఉంచిన ప్రెజర్ కుక్కర్, దానిలో కళ్లు తెరిచి ఆశ్చర్యంగా చూస్తోన్న మనిషి తల, కుక్కర్ లోపల నుంచి బయటికి వస్తోన్న ఆవిరి’ దీనితో ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. స్పాట్ స్పిరిట్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈటీజర్ ను చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. మీరు నివసిస్తున్న ఇంట్లో మీకు తెలియని కంపెనీ ఉంటే? మీరు ఆత్మను ఎలా గుర్తిస్తారు ? మీకు తెలిస్తే మాకు చెప్పండ‌ని టీజ‌ర్ విడుద‌ల చేశారు.  ఇక రాజ్ కుమార్ రావు అతని ఫఫ్యామిలీ ఒక ఇంట్లో ఉంటున్నారు.. వారితో పాటు ఒక స్పిరిట్ కూడా ఉంటుంది.. ఆత్మను మీరు చూసారా? అంటూ ఒక ప్రశ్నను సంధిస్తూ టీజర్ ను కట్ చేశారు చిత్రయూనిట్. మొత్తానికి ఇందులోని స‌న్నివేశాల‌ని బ‌ట్టి ఈ చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగించేలా ర‌విబాబు తెరకెక్కించిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

కాగా ఈ సినిమాలో రవిబాబు, నేహా చౌహాన్, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణ లో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు… వైధ్య సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ను కూడా త్వరలో రిలీజ్ చేసి అక్టోబర్ లో సినిమాను రిలీజ్ అయ్యచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి రవిబాబుకి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =