కొత్త లుక్ తో అదరగొట్టిన రానా

Rana Daggubati Impresses With New Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,#Housefull4Trailer, Housefull 4 Movie Latest News, Housefull 4 Movie Trailer, Housefull 4 Movie Updates, Housefull 4 Trailer, latest telugu movies news, Rana Daggubati Has A Special Role In Housefull 4, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

‘హౌస్ ఫుల్’.. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సిరీస్. ఇక మూడు సిరీస్ లు మంచిగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు హౌస్ ఫుల్ 4 తో వస్తున్నారు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్,కృతి సనన్, రితేష్ దేశముఖ్, బాబీ డియోల్, కృతి కర్బంద, పూజ హెగ్డే నటిస్తున్నారు. మూడు ప్రేమ జంటల మధ్య రెండు భిన్న కాలాలలో జరిగే గందర గోళమే హౌస్ ఫుల్4 చిత్రం. ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హంక్ రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రానా క్యారెక్టర్ ఎలా ఉంటుందబ్బా..? అని చూస్తున్న వారికి తన లుక్ తో పెద్ద షాకే ఇచ్చాడు. ట్రైలర్ లో ఆయన లుక్ చూసిన ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. హాలీవుడ్ సినిమాలలో.. రాజుల కాలంలో జైన్ట్ మోన్స్టర్ పాత్ర రానా చేసినట్టు తెలుస్తుంది.

కాగా ఫర్హాద్ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ ఫిలిమ్స్, మరియు సాజిద్ నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది దీపావళి కానుకగా హౌస్ ఫుల్ 4 విడుదల కానుంది. మరి ఈ పార్ట్ లో కూడా కామెడీకి ఎలాంటి ఢోకా లేదనిపిస్తుంది. దీనితో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ ఫుల్ అయ్యేట్టు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 4 =