‘చాణక్య’ ట్రైలర్ రిలీజ్

Gopichand Starrer Chanakya Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Chanakya Movie Updates,Chanakya Telugu Movie Latest News,Chanakya Movie Trailer,Chanakya Telugu Movie Trailer,#ChanakyaTrailer,Chanakya Theatrical Trailer,Chanakya Official Trailer

తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో ‘చాణక్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చెయ్యగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అంతే కాదు ట్రైలర్ ను బట్టి చూస్తే గోపీచంద్ ‘రామకృష్ణ’ అనే బ్యాంకు ఉద్యోగిగా, ‘అర్జున్’ అనే రా ఏజెంట్ గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్ మరియు బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. దసరా పండుగా నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 10 =