పరుచూరి బ్రదర్స్ లో ఎవరు బెస్ట్ ? వేంకటేశ్వర రావా? గోపాలకృష్ణా ?

Latest Telugu Movies News, Paruchuri Brothers Latest News, Paruchuri Gopala Krishna Latest Updates, Paruchuri Gopala Krishna Vs Paruchuri Venkateswara Rao, Paruchuri Venkateswara Rao, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Who Is The Best of Paruchuri Brothers?

పరుచూరి బ్రదర్స్… పరిచయ వాక్యాలు అవసరం లేని సుప్రసిద్ధ రచయితలు, దర్శకులు, నటులు, ప్రయోక్తలు,వక్తలు,మానవతావాదులు. ఒకటి ఒకటి రెండు కావటం గణితశాస్త్రం అయితే ఒకటి ఒకటి ఒకటే కావటం 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న అద్భుత అనుబంధం. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన వీరికి “పరుచూరి బ్రదర్స్” అని నామకరణం చేశారో తెలియదు గాని అన్నదమ్ముల అనుబంధానికి అర్థంగా,అద్దంగా నిలువెత్తు నిదర్శనంగా సాగుతుంది ఈ సోదరుల అనుబంధ స్రవంతి. పురాణాల్లో ఆదర్శ అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులను చూపిస్తారు. ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా చూపించే ఐడియల్ బ్రదర్స్ మన పరుచూరి బ్రదర్స్ అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ బ్రదర్స్ ఇద్దరిలో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావుకు కామ్ గోయింగ్ జెంటిల్మెన్ అనే పేరు ఉంటే, తమ్ముడు గోపాలకృష్ణ కు ఫైర్ బ్రాండ్ అనే బ్రాండింగ్ ఉంది. అన్న రాముడు అయితే తమ్ముడు భీముడు… అన్న చాణుక్యుడు అయితే తమ్ముడు చంద్రగుప్తుడు, వరస మారినప్పటికీ అన్న కృష్ణుడు అయితే తమ్ముడు అర్జునుడు… మొత్తం మీద అన్న ఆలోచన అయితే తమ్ముడు ఆవేశం. ఇలాంటి విభిన్న భావావేశాల రెండు కత్తులు ఒకే వరలో ఇమిడిపోయి నాలుగు దశాబ్దాల అలుపెరుగని అక్షర ప్రస్థానం సాగించటం అద్భుతమే కాదు.. అనితరసాధ్యం కూడా. కుటుంబ అనుబంధాలు, మానవ సంబంధాలు మాయమైపోతున్న ఈ రోజుల్లో పరుచూరి బ్రదర్స్ తమ అద్భుతమైన అనుబంధ పటిష్టత ద్వారా సమాజానికి అంతర్లీనంగా గొప్ప సందేశాన్ని ఇస్తున్నట్లుగా భావించవచ్చు. కాగా ఈ ఆదర్శ సోదరులలో చిన్నవాడైన పరుచూరి గోపాలకృష్ణ జన్మదినం ఈ రోజు.

1947 సెప్టెంబర్ 25 న జన్మించిన గోపాలకృష్ణ నేటితో 73 వ పడిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భంగా అలుపెరుగని అక్షర సైనికుడు పరుచూరి గోపాలకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు పలుకుతూ సరదాగా ఒక పోల్ గేమ్ నిర్వహిస్తోంది “ద తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కం“.

అదేమిటంటే- 40 ఏళ్ల నుండి ఒకే మాటగా, ఒకే బాటగా సాగుతున్న పరుచూరి సోదరులలో ఎవరు బెస్ట్? అన్నదే ఈ పోల్ గేమ్. ఇదేమిటయ్యా ..? అన్నదమ్ముల అనుబంధానికే రోల్ మోడల్స్ లాంటి
పరుచూరి సోదరుల మధ్య ఫిట్టింగ్ పెట్టటానికే ఇలాంటి పోల్ గేమ్ పెడుతున్నారా ? అని మీరు అనుకోవచ్చు. కానీ నిజానికి చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరి బ్రదర్స్ కు ఎవరి పర్సనల్ ఫాలోయింగ్ వారికి ఉంది. కొంతమంది హీరోలు దర్శకనిర్మాతలు పరుచూరి వెంకటేశ్వరరావు ‘బంగారం’ అంటే మరి కొంతమంది పరుచూరి గోపాలకృష్ణ ను 24 క్యారెట్స్ అంటారు. ఇంతకూ మీరేమంటారు…

ఆ ఇద్దరిలో ఎవరు బెస్ట్?

అసలు ఇలాంటి పోటీ పెట్టడానికి ఎంత ధైర్యం? అనుకుంటున్నారా? ఆ భయం ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే ఆ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అన్నా మరొకరితో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిజానికి ఇది అన్నదమ్ముల మధ్య పోటీ కాదు.. ఆలోచనకు – ఆవేశానికి, సౌమ్యతకు- దూకుడుకు, చాణుక్యానికి శౌర్యానికి మధ్య పోటీ. కాబట్టి నిర్భయంగా ఓటింగులో పాల్గొని పరుచూరి బ్రదర్స్ లో THE BEST ను సెలెక్ట్ చేయండి.

పరుచూరి బ్రదర్స్ లో ఎవరు బెస్ట్ ? వేంకటేశ్వర రావా? గోపాలకృష్ణా ?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here