సంపత్ నంది-గోపీచంద్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Heroine Fixed For Sampath Nandi And Gopichand New Movie,Gopichand New Movie Heroine Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gopichand New Movie Updates,Gopichand Next Film News,Gopichand Upcoming Movie Details,Gopichand Next Project Details,#Gopichand

ప్రస్తుతం గోపీచంద్ చాణక్య సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో గోపీచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చాణక్య’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దసరా పండుగా నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మెహ్రీన్ కౌర్, బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా గోపి చంద్ సంపత్ నందితో కొత్త సినిమాను లైన్లో పెట్టిన సంగతి కూడా తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటించనుందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

కాగా ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో నిర్మిస్తున్నారు. ఇక సంపత్ నంది, గోపీచంద్ కోసం మంచి కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. డిసెంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =