మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల తార రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో అటవీ నేపథ్యం తో ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న ఈ మూవీ లో రష్మిక పల్లెటూరి యువతి క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అల .. వైకుంఠపురము లో … మూవీ షూటింగ్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే అర్జున్, సుకుమార్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన రంగస్థలం మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రంగస్థలం మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన సమంత సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకొన్నారు. పలు మూవీ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న రష్మిక కు పెర్ఫామెన్స్ కు అవకాశమున్న క్యారెక్టర్ లో నటించనున్నారని సమాచారం. రంగస్థలం మూవీ ఘనవిజయం సాధించినట్టే అర్జున్, సుకుమార్ మూవీ ఘనవిజయం పొందాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: