నాగ చైతన్య మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Naga Chaitanya And Sai Pallavi Movie First Schedule Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Naga Chaitanya And Sai Pallavi New Movie First Schedule Completed,Naga Chaitanya And Sai Pallavi First Schedule Latest Updates

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా అందమైన ప్రేమకథ తో రూపొందుతున్న మూవీ షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమై షూటింగ్ మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొంది. ఈ షెడ్యూల్ లో కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. హీరో నాగచైతన్య, శేఖర్ కమ్ముల ఫస్ట్ కాంబినేషన్ మూవీ తో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సంస్థ నిర్మాణ రంగంలో ఎంటరవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ నారాయణ దాస్, FDC ఛైర్మన్ రామ్మోహన రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది. డిసెంబర్ లో క్రిస్టమస్ కు ఈ మూవీ ని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ ఫిదా మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రుపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ హిట్ మజిలీ మూవీ తరువాత నాగచైతన్య నటిస్తున్న, కొత్త కాంబినేషన్స్ తో రూపొందుతున్న ఈ మూవీ కై ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =