టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది ‘ఛలో’ భామ రష్మిక మందన. ‘ఛలో’, ‘గీత గోవిందం’ సినిమాలతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే రష్మిక చేతిలో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్న రష్మిక తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది. కన్నడలోనూ వరుస సినిమాలలో నటిస్తోంది. తమిళ్ లో కూడా కార్తికి జోడీగా ఓ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం బన్నీ-సుకుమార్ సినిమాలో రష్మిక చేస్తున్న పాత్రపై ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి విన్పిస్తుంది. ఈ సినిమాలో రష్మిక విలేజ్ గర్ల్ పాత్రలో నటిస్తుందన్న టాక్స్ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను హైద్రాబాద్లో అక్టోబర్ 3వ తేదీన లాంచ్ చేయనున్నారు. నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.
మొత్తానికి సినిమా సినిమాకు డిఫరెంట్ వేరియేషన్స్ ను చూపిస్తూ రష్మిక తన కెరీర్ లో దూసుకుపోతుంది. ‘ఛలో’ సినిమాలో కాలేజ్ గర్ల్ రోల్, ‘గీత గోవిందం’ సినిమాలో ప్రొఫెషనల్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ గా ఇలా ప్రతి సినిమాలో వేరియేషన్ ను చూపిస్తుంది. మరి చూద్దాం ఏ సినిమా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: