‘బుద్ధివంత 2’ హాలీవుడ్ రేంజ్ లో ఉపేంద్ర లుక్..!

Upendra Hollywood Range Look In Buddhivantha 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2019,Tollywood Cinema Updates,Buddhivantha 2 Movie Updates,Buddhivantha 2 Movie Latest News,Upendra Buddhivantha 2 Movie,Real Star Upendra Buddhivantha 2 Movie

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన తరువాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. కన్నడలోనే కాదు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి ఇక్కడ కూడా అభిమానులను ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడూ ప్రయోగాలనే ఇష్టపడే ఉపేంద్ర.. ప్రస్తుతం కన్నడలో ‘హోమ్ మినిస్టర్’, ‘రవిచంద్ర’, ‘బుద్ధివంత 2’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు రియల్ స్టార్ ఉపేంద్ర.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2013లో ‘బుద్ధివంతా’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘బుద్ధివంత 2’ అనే సినిమాను లైన్ లో పెట్టాడు ఉపేంద్ర. ఇక ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘బుద్ధివంత 2’ సినిమా నుండి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా మరో కొత్త గెటప్ తో ఉపేంద్ర లుక్ ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ రేంజ్ ను తలపిస్తుంది.

కాగా క్రిస్టల్ పార్క్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘనా రాజ్, సోనాలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఆదిత్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని.. ఇలానే విభిన్నమైన సినిమాలు ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుందాం!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 17 =