కోడెల ఆత్మహత్యకు సన్ స్ట్రోకే కారణం అంటున్న సినీ ప్రముఖులు

Film Fraternity Comments on Kodela Siva Prasad Demise,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tollywood Celebs About Kodela Siva Prasad Demise,Tollywood Celebrities Comments on Kodela Siva Prasad Demise,Kodela Siva Prasad Is No More,RIP Kodela Siva Prasad

ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్, సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఆయన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ప్రతిపక్ష తెలుగుదేశం – అధికారపక్షం  వైయస్సార్ సిపి లు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్న వైనం జనానికి చీదర పుట్టిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమతో కూడా అనుబంధం కలిగిన కోడెల శివప్రసాద్  ఆత్మహత్య గురించి” తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” ప్రశ్నించగా పేరు చెప్పటానికి ఇష్టపడని కొందరు సినీ ప్రముఖులు దీనికంతటికీ “సన్ స్ట్రోకే”  కారణం అని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా మంచివాడు, సమర్ధుడు  అయిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు  కాదు. కానీ ఆయన కుమారుడు, కుమార్తెల  అక్రమాలు, దౌర్జన్యాల కారణంగా ఏర్పడిన అప్రదిష్టకర పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆయన ఇంతటి దారుణ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాన్ని పలువురు సినీ ప్రముఖులు వ్యక్తం చేశారు.

“పుత్రా జిత్ పరాజయం”- ఇది తండ్రిని మించిన విజయాలు సాధించిన కొడుకును అభినందించే సందర్భంలో   వాడే పదం. ప్రతిభ , కార్యసాధన విషయాల్లో కొడుకు చేతిలో ఓడిపోవటాన్ని మించిన ఆనందం, అదృష్టం తండ్రికి వేరొకటి ఉండదు. కానీ దౌర్జన్యం, రౌడీయిజం, దోపిడీ వంటి విషయాలలో తండ్రిని పక్కకు నెట్టి ఆయన రాజకీయ పలుకుబడి, ప్రాబల్యాలను స్వప్రయోజనాలకు వాడుకునే సంతానంగా కోడెల కొడుకు, కూతురు జిల్లా వ్యాప్తంగా అప్రదిష్టను మూటగట్టు కోవటమే ఆయన ఆత్మహత్యకు ప్రధాన కారణం అని చాలా మంది సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

పల్నాడు ప్రాంతంలో ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఏ వ్యాపారం ప్రారంభించినా, ఇంకేదైనా లబ్ధిపొందినా ముందుగా “కోడెల టాక్స్” కట్టి తీరాలన్నది ఉల్లంఘించలేని దౌర్జన్యంగా చలామణి అయింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నంత కాలం యథేచ్చగా సాగిన ఈ అధికార దౌర్జన్యం అనేక మంది బాధితులను సృష్టించింది. కొడుకు కూతురు ఇలాంటి అరాచకాలు చేస్తుంటే చూసీచూడనట్టు వ్యవహరించిన కోడెలను ఇప్పుడు అనేక విషమ సమస్యలు చుట్టుముట్టాయి. కోడెల కుటుంబ బాధితులతో పాటు, అసెంబ్లీ ఆస్తుల స్వాహా పై ప్రభుత్వం కూడా కేసులు నమోదు చేయటంతో కోడెల ఖిన్నులయ్యారు. అన్నింటినీ మించి ప్రవర్తన మార్చుకోవలసిందిగా హితవు చెప్పిన తండ్రి మీదకే కొడుకు చేయి చేసుకునే పరిస్థితి ఏర్పడటం వల్లనే కోడెల ఇంత దారుణ, దయనీయ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

తండ్రి రాజకీయంగా ఎదిగితే ఆ నీడలో ఆయన ఆశయాలను, సమర్ధతను, లెగసీని కొనసాగించే కొడుకులు చాలామంది ఉన్నారు. అలాగే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా ప్రవర్తించే సుపుత్రులు, పుత్రికలు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో రెండో కోవకు చెందిన  కోడెల సంతానం చివరకు ఆయన ఆత్మహత్యకు పురికొల్పే పరిస్థితులను సృష్టించారని… చివరకు ఆయన చావునే K- Tax రూపంలో చెల్లించారని జనం చెప్పుకుంటున్నది  వాస్తవ దూరం కాదు.

ఒకళ్ళను బాధించి సంపాదించే  కోట్లను, కూడబెట్టుకునే ఆస్తులను చివరికి కూడా తీసుకెళ్ళగలరా ?
ఏం చేసుకుంటారు? ఎక్కడ దాచుకుంటారు ఆ పాపిష్టి సొమ్మును ? అని నిలదీస్తున్న, నినదిస్తున్న జనానికి చెప్పగల జవాబు ఏమిటి?

అత్యంత అనూహ్యంగా, అప్రధిష్టా కరంగా ఆత్మహత్యకు పాల్పడిన కోడెల నిష్క్రమణమే దీనికి జవాబు అనుకోవాలా?

ఇదీ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య పై పేరు చెప్పడానికి ఇష్టపడని సినీ ప్రముఖుల అభిప్రాయాల సారాంశం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =