వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ మూవీస్ నిర్మించిన మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్, ఆయన తనయ నిర్మాత ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ ఎఫైర్స్, కోల్ &మైన్స్ జోషి ప్రల్హద్ తో సమావేశమయ్యారు. మంత్రి జోషి ప్రల్హద్ మాట్లాడుతూ .. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం లో 370 ఆర్టికల్ రద్దయిందని, ఫిల్మ్ మేకర్స్ వారి మూవీ షూటింగ్స్ జమ్ము కశ్మీర్ లో
జరుపుకొమ్మని కోరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీ నగర్ అద్భుతమైన లొకేషన్స్ తో భూతల స్వర్గం గా పిలవబడేది. సరస్సులు, మొఘల్ గార్డెన్స్, తులిప్ గార్డెన్స్, సుందర లోయలు వంటి అద్భుతమైన లొకేషన్స్ తో మూవీ షూటింగ్స్ కు అనువుగా ఉండేది. ఒకప్పుడు శ్రీనగర్ లో బాలీవుడ్, టాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ ఎక్కువగా జరిగేవి. ఉగ్రవాద చర్యల వల్లషూటింగ్స్ కు ఆటంకం కలుగుతుందనే కారణం తో నిర్మాతలు జమ్ము కశ్మీర్ లో షూటింగ్స్ కు విముఖత చూపుతున్నారు. ఫారిన్ లో షూటింగ్ అంటే వ్యయ , ప్రయాసలతో కూడుకున్నది. జమ్ము కాశ్మీర్ లో షూటింగ్ వల్ల ఖర్చు, సమయం ఆదా అవుతాయి. ప్రధాన మంత్రి ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రశాంతం గా ఉన్నజమ్ము కాశ్మీర్ లో షూటింగ్స్ జరుపుకోమని మోదీ నిర్మాతలకు పిలుపు నిచ్చారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: