అందాల అభిన‌యం శ్రియ

Telugu FilmNagar Wishes Shriya Saran A Very Happy Birthday,Shriya Saran – An Actress With A Great Track Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Shriya Saran,Heroine Shriya Saran Latest News,Happy Birthday Shriya Saran,Shriya Saran Upcoming Movie News,Shriya Saran Next Film Updates,Shriya Saran New Movie News

శ్రియా శరన్… ఈ పేరు చెబితే చాలు వేసవికాలం వెన్నెలలా, సంక్రాంతి ముగ్గులా పొందికగా ఉండే అందమైన రూపం కళ్ళ ముందు కదలాడుతుంది. కేవలం గ్లామ‌ర్ రోల్స్ కే ప‌రిమితం కాకుండా పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర‌ల్లోనూ మెప్పించిన వైనం శ్రియ సొంతం. `ఇష్టం`(2001)తో న‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్టిన శ్రియ‌… ఆపై తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, ఆంగ్ల భాషా చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌దైన బాణీతో ముందుకు సాగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, య‌న్టీఆర్‌, ప్ర‌భాస్‌, ర‌వితేజ వంటి టాలీవుడ్ స్టార్ హీరోల‌తో పాటు ర‌జ‌నీకాంత్‌, విజ‌య్‌, విక్ర‌మ్‌, మోహ‌న్‌లాల్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ వంటి ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల అగ్ర క‌థానాయ‌కుల‌తోనూ జ‌ట్టుక‌ట్టి మురిపించింది శ్రియ‌. కథానాయికగా ఐదేళ్ళ పాటు కొనసాగడమే గగనమైపోతున్న ఈ కాలంలో… దాదాపు 18 ఏళ్ళుగా నాయిక‌గా రాణిస్తూ విస్మ‌య‌ప‌రుస్తోందీ సొగ‌సుల సిరి. పెళ్ళ‌యాక ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్న ఈ అందాల అభిన‌యం… త్వ‌ర‌లో ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించనుంది. కాగా… నేడు శ్రియ పుట్టిన‌రోజు. ఈ సందర్భంగా… శ్రియ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ… మ‌రిన్ని వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో ఆమె అల‌రించాల‌ని బ‌ర్త్ డే విషెస్ చెబుతోంది `ద తెలుగుఫిల్మ్‌న‌గ‌ర్‌.కామ్‌`.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − seven =