తొలి వారాంతానికి 370 కోట్ల ‘బాహుబలి’గా ‘సాహో’ సంచలన విజయం

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho 1st Week Worldwide Collections, Saaho Movie Collections,Saaho 1st Week Area Wise Collections, Prabhas Saho 1st Week Total Collections, Saaho Box Office Collection , Saaho Day 7 Telugu Box Office Collection

ఉత్తమ చిత్రం అంటే ఏమిటి?… దానికి నిర్వచనం ఏమిటి ? అన్న చర్చ ఈ నాటిది కాదు. సినిమా పుట్టుకతో పాటే పుట్టిన చర్చనీయాంశం అది. చాలా మంది సినీ ప్రముఖులు ఉత్తమ చిత్రానికి తమదైన శైలిలో నిర్వచనాలు చెప్పారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు “డబ్బులు వచ్చిందే ఉత్తమ చిత్రం” అని సింపుల్ గా తేల్చిపారేశారు. అప్పట్లో ఆయన చెప్పిన నిర్వచనం మీద తీవ్ర వాదోపవాదాలు జరిగినప్పటికీ ఎన్నో సందర్భాల్లో అదే నిజమని తేలింది. జనాదరణను  మాత్రమే ఒక సినిమా విజయానికి కొలమానంగా తీసుకుంటే గత వారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన ‘సాహో’ను ఒక నిజమైన ఘనవిజయంగా చెప్పుకోవాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకు  క్రిటిక్స్ నుండి తొలి రోజున తొలి షో కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా భవిష్యత్తు ఏమౌతుంది అనే ఆందోళన అందరిలో కలిగింది. కానీ నేషనల్ మీడియా మొత్తం ఇచ్చిన నెగిటివ్ రిపోర్ట్స్ కు పూర్తి భిన్నంగా సాహో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.తొలి వారాంతానికి 370 కోట్ల  గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సాహో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కలెక్షన్స్ లోనే కాకుండా ఏరియావైజ్, థియేటర్స్ వైస్, స్టార్ వైజ్ కలెక్షన్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పటం ఫిలిమ్ ట్రేడ్ ను ఆశ్చర్యానికి గురి చేసింది.

ముఖ్యంగా నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ నుండి వస్తున్న కలెక్షన్ల సునామి ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా పాపులారిటీకి అద్దం పడుతుంది. సాధారణంగా సౌత్ ఇండియన్ స్టార్స్ ను ఎక్సెప్ట్ చేయడంలో నార్త్ ఇండియా ప్రేక్షకులుగాని, మీడియాగాని పాజిటివ్ గా స్పందించవు. తప్పనిసరి అయితే తప్ప సౌత్ ఇండియన్ విక్టరీని ఆమోదించరు. అలాంటిది బాహుబలి సిరీస్, సాహో చిత్రాలతో ప్రభాస్ నార్త్ లో కూడా విజయ బావుటాఎగుర వేసాడు. తమ రివ్యూలకు సంబంధంలేని డాజిలింగ్ రెవిన్యూ కళ్ళ ముందు కనిపిస్తుంటే మరుసటి రోజు నుండే సాహో విజయ పరంపరను విశేషంగా హైలైట్ చేసింది నార్త్ మీడియా.

ముఖ్యంగా పంజాబ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సాహో కలెక్షన్ల సునామీ ముందు సాగిల పడ్డాయి నార్త్ ట్రేడ్ అండ్ మీడియా. ప్రతి సినిమాకు సెంటిమెంటల్ స్టోరీ, ఊహించని  ట్విస్టులు ఉండనవసరం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ ఎపిసోడ్స్, మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ తో సినిమాను హిట్  చేయవచ్చు అని నిరూపించిన యాక్షన్ థ్రిల్లర్ సాహో అంటూ కీర్తిస్తుంది నేషనల్ మీడియా.

ఈ నేపథ్యంలో 7వ రోజుకు ప్రపంచవ్యాప్తంగా 370 కోట్ల మార్కును చేరుకున్నట్లుగా ఇప్పుడే ఒక సగర్వ ప్రకటన చేసింది యు.వి క్రియేషన్స్.జస్ట్ వన్ పిక్చర్ ఓల్డ్ డైరెక్టర్ సుజిత్ మీద నమ్మకంతో ప్రభాస్ – యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా చేసిన సాహో అనే ఈ  అడ్వెంచరస్ ఎఫెర్ట్ లాంగ్ రన్ లో ఇంకెన్ని కోట్ల రికార్డు దగ్గర ల్యాండ్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =