నెక్ట్స్ షెడ్యూల్‌కి ముస్తాబ‌వుతున్న బాల‌య్య కొత్త చిత్రం

#NandamuriBalakrishna, Balakrishna Gears up for Next Schedule Shoot, Latest Telugu Movies News, Nandamuri Balakrishna Latest News, Nandamuri Balakrishna New Movie Details, Nandamuri Balakrishna Next Film Updates, Nandamuri Balakrishna Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates

`య‌న్టీఆర్‌` బ‌యోపిక్ త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌… ప్ర‌స్తుతం కె.య‌స్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాల‌య్య‌కి జోడీగా సోనాల్ చౌహాన్‌, వేదిక నాయిక‌లుగా న‌టిస్తుండ‌గా… భూమికా చావ్లా, ప్ర‌కాష్ రాజ్‌, జ‌య‌సుధ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవ‌ల థాయ్‌లాండ్‌లో భారీ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుని భాగ్య‌న‌గ‌రం చేరుకుంది యూనిట్‌. కాగా… ఈ చిత్రానికి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్‌ని ఈ నెల 5 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 21న ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

మ‌రి… `జై సింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత బాల‌య్య‌, కె.య‌స్‌.ర‌వికుమార్‌, సి.క‌ళ్యాణ్‌, స్వ‌ర‌క‌ర్త చిరంత‌న్ భ‌ట్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా కూడా అదే బాట ప‌డుతుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.