రీమిక్స్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్న శ్రీ‌దేవి పాపుల‌ర్ సాంగ్స్‌

Actress Sridevi Songs, Beauty Queen Sridevi Telugu Movie Hit Songs, Heroine Sridevi Songs Remixes in Telugu Movies, Latest Telugu Movies News, Sridevi, Sridevi Blockbuster Songs Remixes in Telugu Movies, Sridevi Evergreen Golden Hit Songs In Telugu, Sridevi Hit Songs, Sridevi Popular Songs, Sridevi Songs Remixes in Telugu Movies, Sridevi Super Hit Telugu Songs, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates

శ్రీదేవి… అందానికి, అభినయానికి ఐకాన్‌లా నిల‌చిన ఓ త‌రం అగ్ర క‌థానాయిక‌. ఆల్ ఇండియా సూప‌ర్‌స్టార్ అనిపించుకున్న శ్రీ‌దేవికి సంబంధించి ఆమె పోషించిన పాత్ర‌లే కాదు నర్తించిన గీతాలు కూడా నిత్య‌నూత‌న‌మే. అంతేకాదు… ఈ తరం క‌థానాయిక‌ల‌కు మార్గదర్శకురాలిగా నిలచిన శ్రీదేవిని దృష్టిలో పెట్టుకుని… ఇప్పటికే కొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె పాటలను రీమిక్స్ చేయగా… తాజాగా మరికొంతమంది ఇదే బాటలో నడుస్తున్నారు. ముఖ్యంగా… ఈ ఏడాదినైతే శ్రీ‌దేవి రీమిక్స్ నామ సంవ‌త్స‌రం అనొచ్చేమో. ఎందుకంటే… శ్రీ‌దేవి న‌ర్తించిన మూడు పాట‌లు రీమిక్స్ రూపంలో సంద‌డి చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ఈ సంవ‌త్స‌రం ఆరంభంలో విడుద‌లైన `య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు`లో `ఆకుచాటు పిందె త‌డిసె` (వేట‌గాడు) పాట‌ని రీమిక్స్ చేయ‌గా… శ్రీ‌దేవి పాత్ర‌లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న చిందుల‌తో క‌నువిందు చేసింది. ఇక ఈ నెల 20న రానున్న `వాల్మీకి`లోనూ శ్రీ‌దేవి పాపుల‌ర్ సాంగ్ రీమిక్స్‌కి స్థాన‌ముందట‌. `ఎల్లువొచ్చి గోదార‌మ్మ‌` (దేవ‌త‌)కి రీమిక్స్ గా రానున్న ఈ పాట‌లో పూజా హెగ్డే సంద‌డి చేయ‌నుంది. ఇందులో పూజ పాత్ర పేరు శ్రీ‌దేవి కావ‌డం ఆస‌క్తిదాయ‌కం. ఇక `పాగ‌ల్ పంతి` పేరుతో రూపొందుతున్న హిందీ చిత్రంలో… `చాల్ బాజ్‌`(హిందీ) కోసం శ్రీ‌దేవి న‌ర్తించిన `తేరా బీమార్ మేరా దిల్‌` పాట‌ని రీమిక్స్ చేస్తున్నారు. ఇందులో గోవా సుంద‌రి ఇలియానా కాలు క‌ద‌ప‌నుంది.

మ‌రి… ఈ రీమిక్స్ గీతాలు ఏ మేర‌కు రంజింప‌జేస్తాయో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.