మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం `ప్రతి రోజూ పండగే`. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం థమన్ స్వరాలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. అక్కడి హౌజ్ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని… మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని సమాచారం. అనంతరం రాజమండ్రిలో నెక్ట్స్ షెడ్యూల్ జరుగుతుందని తెలిసింది.
కాగా… క్రిస్మస్ కానుకగా `ప్రతి రోజూ పండగే` ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























