గత ఏడాది సెప్లెంబర్ 13… అక్కినేని అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. అదే రోజున అక్కినేని లవ్లీ కపుల్స్ నాగచైతన్య, సమంత వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. చైతూ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `శైలజారెడ్డి అల్లుడు` సెప్టెంబర్ 13న రిలీజ్ కాగా… సామ్ నటించిన రీమేక్ థ్రిల్లర్ `యూ టర్న్` కూడా అదే రోజున తెరపైకి వచ్చింది. ఈ రెండు సినిమాలూ చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి.
కట్ చేస్తే… ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 13 వార్తల్లో నిలుస్తోంది. అయితే… ఈ సారి అక్కినేని ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం లేదు కానీ… రెండు ఆసక్తికరమైన చిత్రాల మధ్య మాత్రం పోటీ ఉంటోంది. ఆ సినిమాలే… నాని `గ్యాంగ్ లీడర్`, వరుణ్ తేజ్ `వాల్మీకి`. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ రెండు చిత్రాలు కూడా పాత టైటిల్స్‌తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. మహానటుడు యన్టీఆర్ నటించిన `వాల్మీకి`(1963) టైటిల్‌తో వరుణ్ `వాల్మీకి` రూపొందుతుంటే… మెగాస్టార్ చిరంజీవి నటించిన `గ్యాంగ్‌లీడర్`(1991) టైటిల్‌తో నాని కొత్త చిత్రం వస్తోంది. మరి… పాత టైటిల్స్‌తో వస్తున్న ఈ కొత్త చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో తెలియాలంటే సెప్టెంబర్ 13వరకు వేచిచూడాల్సిందే.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.