ఎన్ని సినిమాలు తీసినా.. ఎన్ని విభిన్నమైన పాత్రలు చేసినా దానికి మంచి గుర్తింపు వచ్చినప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎంత ప్యాషన్ తో సినిమాలు చేసినా తమకు కూడా మంచి అవార్డులు రావాలన్న స్వార్థం కొంచమైనా నటీనటుల మనసులో ఉంటుంది. ఆ నాటి తరం నుండి నేటి వరకు ఎంతో మంది నటీ నటులకు ఎన్నో అవార్డులు దక్కాయి. ఇక ఎంత మంది నటీనటులు సినిమాల్లో నటించినప్పటికీ కొందరినే జాతీయ అవార్డు వరిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సినిమాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చే ఈ అవార్డును దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు కదా. ఇప్పుడు అలాంటి గొప్ప అనుభూతిలోనే వుంది కీర్తి సురేష్. ఇక మన తెలుగు నాటికీ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కి ఏకంగా 29 ఏళ్లు కావడం మరో విశేషం. మరి ఇప్పటివరకు మన నటీమణులకు ఎంత మందికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముందుగా ఈ అవార్డు పొందిన నటీమణి ఊర్వశి శారద. ఆమె 1978లో ‘నిమజ్జనం’ అనే సినిమాకు జాతీయ ఉత్తమనటిగా ఎంపికైంది. ఆ తర్వాత రెండుసార్లు అవార్డు గెలిచారు కానీ.. అది తెలుగు సినిమాకు కాదు. ఆ తర్వాత 10 ఏళ్లకు 1988లో వచ్చిన ‘దాసి’ చిత్రానికి కథానాయిక అర్చన జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. అనంతరం మూడేళ్లకు 1990లో ‘లేడీ సూపర్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి ‘కర్తవ్యం’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకున్నారు. అంతే అప్పటి నుంచి ఇప్పటివరకూ మన తెలుగు సినిమాలో జాతీయ ఉత్తమ నటి విభాగంలో పురస్కారం దక్కలేదు.
చకోర పక్షి వర్షపు నీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నట్టు మనకు కూడా ఒక పురస్కారం రాకపోదా అని ఎదురుచూస్తుంది సినీ పరిశ్రమ. ఎవరెవరికో అవార్డులు వస్తుంటాయి తప్ప మనకు రావు. ఐతే కొన్నేళ్ల నుంచి పరిస్థితి మారుతోంది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటుతోంది. ఈసారి ఏకంగా ఏడు అవార్డులు రావడంతో టాలీవుడ్ జనాలు మహదానందంతో ఉన్నారు.
ఈ 29 ఏళ్ళల్లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఎంతో మంది నటీమణులు తెలుగు తెరపై సందడి చేశారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద, భానుప్రియ, సుహాసిని, తర్వాత సౌందర్య ఇలా ఎంతో మంది నటీమణులు తెలుగుతెరను ఏలారు. దురదృష్టం ఏంటంటే.. వేరే భాషల సినిమాలకు అవార్డులందుకున్నారు.. కానీ.. తెలుగుసినిమాల్లో వీరు ఎంత అభినయం ప్రదర్శించినా అవార్డు రాలేదు.
ఇప్పుడు దాదాపు 29 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు జాతీయ ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్ కు పురస్కారం దక్కింది. తెలుగువారి అభిమాన తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కు అవార్డ్ లభించింది. ఇన్నేళ్లకు తెలుగు సినిమాలకు ఈ ఖ్యాతి దక్కడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు ముందు కూడా ఎన్నెన్నో మంచి సినిమాలు తీయాలని.. మన తెలుగు సినిమాలకు ఎన్నేన్నో అవార్డులు రావాలని కోరుకుందాం.
[subscribe]
[youtube_video videoid=7f84zXPByKQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: