రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ప్రేమకు వేళాయెరా’కు 20 ఏళ్ళు

2019 Latest Telugu Film News, JD Chakravarthy Premaku Velayera Finishes 20 Years, 20 Years For JD Chakravarthy Premaku Velayera, Premaku Velayera Completed 20 Years, 20 Glorified Years For Premaku Velayera, Premaku Velayera Telugu Movie, JD Chakravarthy Latest Movie news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
JD Chakravarthy Premaku Velayera Finishes 20 Years

కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ వినోదాత్మ‌క చిత్రాల‌ను రూపొందించ‌డంలో ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీరే వేరు. అలా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెర‌కెక్కించిన‌ చిత్రాలలో ‘ప్రేమకు వేళాయెరా’ ఒకటి. జె.డి.చక్రవర్తి, సౌందర్య తొలిసారి జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో… రవితేజ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, శ్రీహరి, సూర్య‌, రంగనాథ్, బాబూమోహన్, అన్నపూర్ణ, వై.విజయ తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. అందాల తార‌ రమ్యకృష్ణ ఓ ప్ర‌త్యేక గీతంలో నర్తించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్వీ కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో రూపొందిన పాట‌ల్లో “ఇప్పటికిప్పుడు”, “కన్ను కన్ను”, “తళ‌తళ‌ తారకలాగ‌”, “చిన్న గౌను వేసుకున్న” విశేషాదరణ పొందాయి. తరంగ ఫిలిమ్స్ పతాకంపై తరంగ సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రం… అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 1999 ఆగస్టు 6న విడుదలైన ‘ప్రేమకు వేళాయెరా’… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=w0gJf8xR64U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.