నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో… పోలీస్ ఆఫీసర్‌గానూ, గ్యాంగ్‌స్టర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాలయ్య కనిపించనున్నట్టు సమాచారం. కాగా… ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఆగస్టు 7 నుంచి బ్యాంకాక్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాయకానాయికలపై ఓ పాటను చిత్రీకరించనున్నారని టాక్. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నాడు. కాగా… బాలయ్య కెరీర్‌లో 105వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా… 2020 సమ్మర్‌కి విడుదల కానుందని సమాచారం.
[youtube_video videoid=-liXVlw8X4s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: