తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు అంటే ఒక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అని మనకు తెలిసిందే. ఆయన 20 ఏళ్ల కెరీర్ లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఇ్చచ్చాడు. ఇప్పుడు దిల్ రాజు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్ 2’ చిత్రంతో ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని అందుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రాన్ని బోనీకపూర్ తో కలిసి హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. బోనికపూర్‌తో కలిసి ఎఫ్ 2 సినిమాని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని అఫిషియల్‌గా గతంలో ఎనౌన్స్ చేసారు. ఈసినిమాతో పాటు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో పాటు జెర్సీ సినిమాను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీంతో దిల్ రాజు బాలీవుడ్ లో దిల్ రాజు పాగా వేయడానికి ట్రై చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక తాజాగా తనపై వచ్చిన వార్తలపై.. బాలీవుడ్ ఎంట్రీపై స్పందిస్తూ… బాలీవుడ్ లోకి వెళ్లేది ఏదో డబ్బులు సంపాదించడానికి కాదు.. అది తరువాత.. నా మార్కెట్ పెంచుకోవడానికి… నా స్టోరీలను అక్కడి ఆడియన్స్ కు చెప్పడానికి చేస్తున్నా అని క్లారిటీ ఇచ్చారు. మరి ఇక్కడైతే దిల్ రాజు చక్రం తిప్పాడు… బాలీవుడ్ లో తన లక్ ఎలా ఉంటుందో చూద్దాం..
[youtube_video videoid=x_NEfuXTR1c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: