టాలెంట్, ఆటిట్యూడ్, సక్సెస్ – విజయ్ దేవరకొండ జర్నీ

2019 Latest Telugu Movie News, Reasons Behind Vijay Deverakonda Successful Journey in Tollywood, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vijay Deverakonda – Star – Thinker And Great Actor, Vijay Deverakonda Film Journey, Vijay Deverakonda Journey With his All The Movies, Vijay Deverakonda Latest News, Vijay Deverakonda New Movie Updates, Vijay Deverakonda Open Up On His Film Journey
Reasons Behind Vijay Deverakonda Successful Journey in Tollywood

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే నాణేనికి రెండు పక్కలు ఉన్నట్టు… ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చిందంటే… అందుకోసం చాలా కష్టపడ్డాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి… ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అందుకే హిందీలో, తమిళ్ లో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. హిందీలో కూడా ఈసినిమా ఇప్పటికే 200 కోట్లకు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. తమిళ్ లో ఏమవుతుందో చూాడాలి. ఈ సినిమా తరువాత వచ్చిన గీతాగోవిందం కూడా సూపర్ హిట్ అయి 100 కోట్ల క్లబ్ లో చేరి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. ఈ సినిమా తరువాతే టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు సైతం విజయ్ తో సినిమా చేయాలని ఉంది అన్న రేంజ్ కు ఎదిగాడు. మనోడు నక్క తోడ తొక్కాడేమో తెలియదు కానీ.. టాక్సీవాలా సినిమా విషయంలో కూడా అదృష్టం కలిసొచ్చింది. అసలు రిలీజ్ అవ్వడమే లేట్ అయిందనుకుంటే… దానికితోడు సినిమాను ఆన్ లైన్లో రిలీజ్ చేసేశారు. అయినా కూడా సినిమాకు హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక్కడ గమనిస్తే విజయ్ చేసే సినిమాల్లో ప్రతి సినిమాకు చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. పెళ్లి చూపులు సినిమాలో క్యారెక్టర్, తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధమే ఉండదు. ఆ తరువాత విజయ్ ఇలాంటి సినిమాలకే సెట్ అవుతాడేమో అన్న విమర్శలకు గీతా గోవిందంతో కౌంటర్ ఇచ్చాడు. నోటా లో పొలిటీషియన్ గా, టాక్సీవాలా లో మెకానిక్ గా ఇలా ప్రతి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. ఓ రకంగా విజయ్ కు స్టోరీ సెలక్షన్ లో కూడా మంచి టాలెంట్ ఉందని చెప్పొచ్చు. తన సక్సెస్ కు అది కూడా కారణం కావచ్చు. ఇంతకు ముందు తనకు థియేటర్ ఆర్టిస్ట్ చేసిన అనుభవం ఉంది కనుక అది కూడా తనకు హెల్ప్ అయింది.

తన ఆటిట్యూట్ కూడా తనకు ప్లస్ పాయింటే. ఇప్పటి వరకూ ఉన్న హీరోలు ఏం మాట్లాడితే ఏమవుతుందో.. జనాల్లోకి ఎలా వెళుతుందో అని భయపడి చాలా కంట్రోలింగ్ గా మాట్లాడేవాళ్లు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాడు. ఎంత మంది ఉన్నా.. తను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఒక్కోసారి ఇది విమర్శలకు దారి తీసినా.. నేటి యూత్ మాత్రం దీనికే ఫిదా అయి పోయారు. అప్పటివరకూ ఉన్న హీరోలకు కాస్త భిన్నంగా ఉండటంతో ఫాలోయింగ్ పెరిగిపోయింది. కేవలం తెలుగులోనే కాదు.. ఇతర పరిశ్రమల నుండి కూడా ఈ యంగ్ హీరోలకు ఆఫర్లు వస్తున్నాయంటే..పక్క పరిశ్రమ హీరోయిన్లు కూడా తమకు విజయ్ దేవరకొండతో సినిమా చేయలనుందని చెబుతుంటేనే అర్థం చేసుకోవచ్చు అతని క్రేజ్..

సెక్సెస్ బాటలో నడుస్తున్న విజయ్ ఇప్పుడు డియర్ కామ్రేడ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కూడా మంచి హిట్ కొడుతుందటనే అభిప్రాయాలే వెలువడుతున్నాయి. మరి విజయ్ సక్సెస్ పరంపర డియర్ కామ్రేడ్ తో కూడా కొనసాగుతుందా లేదా అన్నది తెలియాలంటే మాత్రం ఇంకా ఒక్కరోజు ఆగాల్సిందే. ఈ సినిమా కూడా హిట్ అయితే విజయ్ రేంజ్ ఎలా ఉంటుందో.. ఆ ఊహా ప్రేక్షకులకే వదిలేస్తున్నాం…

[subscribe]

[youtube_video videoid=x_NEfuXTR1c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eleven =