ఎప్పుడైనా సినిమాలకు ఆపొచ్చు..!

2019 Latest Telugu Movie News, Vijay Deverakonda Says He Will Stop Acting in Movies, Vijay Deverakonda To Stop Acting, I just wanted to quit films says Vijay Deverakonda, Vijay Deverakonda Latest Movie news, Vijay Deverakonda Starrer Dear Comrade Movie Updates, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Vijay Deverakonda About Acting in Movies
Vijay Deverakonda Says He Will Stop Acting in Movies

విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరుగా పాల్గొన్నారు చిత్రయూనిట్. ఇక విజయ్ సినిమా కాబట్టి మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి రేపటితో సినిమా భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న కొన్ని షాకింగ్ విషయాలు తెలిపాడు. ‘నేను ఎప్పుడైనా నటనకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు… నాకు సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా, చేసిందే చేస్తున్నానిపించి బోర్‌ కొట్టినా వెంటనే యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తాను’ అన్నారు. మరి విజయ్ ఫ్యాన్స్ కు ఇది చేదు వార్త లాంటిదే. మరి విజయ్ కు ఎప్పుడు బోరు కొడుతుందో మరి..

కాగా భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈసినిమాను బిగ్‌బెన్‌ సినిమా, మైత్రీ మూవీమేకర్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తుండగా.. రష్మిక మందన మహిళా క్రికెటర్‌గా కనిపిస్తోంది.

[subscribe]

[youtube_video videoid=x_NEfuXTR1c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.