తమిళనాట విలక్షణ పాత్రలతో అలరిస్తున్న నటి ఐశ్వర్యా రాజేష్. కేవలం కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా… అభినయానికి అవకాశమున్న సహాయక పాత్రల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది ఈ తెలుగమ్మాయి. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు, నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్యా రాజేష్…‘కౌసల్యా కృష్ణమూర్తి’ చిత్రం ద్వారా తెలుగులో తొలి అడుగులు వేస్తోంది. అలాగే ‘మిస్ మ్యాచ్’ అనే మరో తెలుగు చిత్రంలోనూ నటించింది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ రెండు చిత్రాల్లో కూడా ఐశ్వర్య క్రీడాకారిణి పాత్రల్లో దర్శనమివ్వనుంది. తమిళ చిత్రం ‘కనా’(ఇందులోనూ ఐశ్వర్యా రాజేష్ కథానాయిక)కి రీమేక్‌గా తెరకెక్కిన ‘కౌసల్యా కృష్ణమూర్తి`లో క్రికెటర్‌గా నటించిన ఐశ్వర్య… ‘మిస్ మ్యాచ్’ మూవీలో రెజ్లర్‌గా కనిపించనుంది. మరి ఈ రెండు పాత్రలు ఐశ్వర్య టాలీవుడ్ కెరీర్‌కు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి.
కాగా… విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ట్రయాంగిల్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ‘బ్రేకప్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే చిత్రంలో ముగ్గురు కథానాయికలలో ఒకరిగా నటిస్తోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.
[youtube_video videoid=SLLrip9vfp0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: