మహేష్ విషయంలో పూరీ నోరు జారాడా..?

2019 Latest Telugu Movie News, Puri Jagannadh Comments on Mahesh Babu,Puri angers Mahesh fans with controversial comments, Puri Jagannath About Mahesh Babu Fans, Puri Jagannadh controversial comments on Mahesh Babu, Puri Jagan About Mahesh Babu Character Hurts Fans, Mahesh Babu Latest Movie News, Mahesh Babu Upcomig Movie Updates, elugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Puri Jagannadh comments on Mahesh babu

హీరో పాత్రను విభిన్నంగా పరిచయం చేయడంలో పూరి తరువాతే ఎవరైనా. ఐతే పూరి అభిమానులుకూడా ఆయన లాగే కొత్తగా ఆలోచిస్తున్నట్లున్నారు. విషయం ఏమిటంటే వైజాగ్ లోని జగదాంబ ధియేటర్ దగ్గర అభిమానులు ఇస్మార్ట్ శంకర్ పోస్టర్ ని బీరుతో అభిషేకం చేసి వార్తలలో నిలిచారు. సాధారణంగా ఎవరైనా తమ అభిమాన నటుల,డైరెక్టర్ ల కట్ ఔట్స్ ని పాలాభిషేకమో, నీలాభిషేకమో చేస్తారో,కానీ వీరు బీరుతో అభిషేకం చేసి తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోలకు రాని ఓపెనింగ్స్ ఈసినిమాకు వచ్చాయి. అంతేకాదు పూరీకి కానీ, రామ్ కి కానీ ఇప్పటివరకూ ఏ సినిమాకు రానీ కలెక్షన్స్ తెచ్చిపెడుతున్నాయి.

ఇక హీరోల్లో ఉన్న హీరోయిజం ను చూపించడంలో పూరీ తరువాతే ఎవరైనా. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా చెప్పొచ్చు. ఇడియట్,పోకిరి వంటి చిత్రాలతో ఆయన ఓ కొత్త హీరోజం,మేనరిజం పరిచయం చేశాడు. అలానే ఇన్ని రోజులు ఉన్న రామ్ ని కాకుండా కొత్త రామ్ ను చూపించాడు ఈ సినిమాలో. దీంతో పూరి మార్క్ హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవడం మూవీ సక్సెస్ కి దోహదం చేసింది.

అయితే ఇప్పుడు పూరీ మహేష్ పై చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారం రేపుతున్నాయి. పూరీ జగన్నాథ్ పొరపాటున నోరు జారాడా.. లేక ఎప్పటినుండో లోపల పెట్టుకున్న మాటలు ఇలా వదిలాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్లలో పాల్గొన్న పూరీని మహేష్ తో సినిమా ఎప్పుడు అని అడగడంతో… మహేష్ తో పోకిరి, ‘బిజినెస్ మెన్’ లాంటి రెండు హిట్లు ఇచ్చిన తరువాత మరో సినిమా చేయమని ఫ్యాన్స్ అడుగుతుంటారు. నిజానికి నాకు మహేష్ బాబు కంటే ఆయన అభిమానులంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే వాళ్ళ కోసం చెబుతున్నా.. నేను హిట్లలో ఉంటేనే మహేష్ నాతో సినిమా చేస్తాడు అంటూ బాంబ్ పేల్చాడు. అక్కడితో ఆగకుండా సదరు యాంకర్ మరి ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టైతే మహేష్ ఓకే చెప్పవచ్చు కదా అని అడగ్గా పూరి వెంటనే నేను ఓకే చెప్పడానికి నాకూ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా అంటూ ఇంకో బాంబ్ పేల్చారు. దీంతో పూరీ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాయి.

మరి పూరీ చేసిన వ్యాఖ్యలకు మహేష్ ఫ్యాన్స్ ఊరుకుంటారా…? కౌంటర్ల మీద కౌంటర్లు విసురుతున్నారు. మహేష్ పూరితో చేసిన మొదటి సినిమా పోకిరికి ముందు పూరికి ఆంధ్రావాలా, 143, సూపర్ ఇలామూడు సినిమాలు వరుసగా ప్లాప్ లు ఉన్నాయని… అలాగే మహేష్ పూరితో చేసిన ‘బిజినెస్ మెన్’ సినిమాకి ముందు కూడా పూరికి ‘ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి’ ఇలా వరుసగా ప్లాప్ లు ఉన్నాయని..అప్పుడు కూడా మహేష్ బిజినెస్ మెన్ ఆఫర్ ఇచ్చాడని సినిమాల లిస్ట్ లు పెట్టి మరీ కడిగేస్తున్నారు. మరి నిజంగానే పూరీ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మహేష్ అవకాశం ఇచ్చాడు. అది గుర్తులేకుండా పూరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా పూరీ నోరు జారడమే. దీనిపై మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

[subscribe]

[youtube_video videoid=XBrORKG0lUw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =