ఇస్మార్ట్ శంకర్ తెలుగు మూవీ రివ్యూ

Ismart Shankar Movie Public Talk, Ismart Shankar Movie Review, Ismart Shankar Movie Review And Ratings, Ismart Shankar Movie Story, Ismart Shankar Review, Ismart Shankar Telugu Movie Live Updates, Ismart Shankar Telugu Movie Public Response, Ismart Shankar Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
iSmart Shankar Telugu Movie Review

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్. అటు పూరీతో పాటు.. ఇటు రామ్ కు కూడా హిట్ చాలా అవసరమైన నేపథ్యంలో ఎంతో కసిగా ఈసినిమాను తెరకెక్కించారు. ఇక టీజర్, ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందా లేదా తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు – రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, షియాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి
దర్శకత్వం : పూరి జగన్నాథ్‌
నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మీ
సంగీతం : మణిశర్మ

కథ:
శంకర్ (రామ్) సెటిల్ మెంట్లు చేస్తూ ఉంటాడు. అలా ఒక సెటిల్ మెంట్ చేసే సమయంలో చాందిని (నభా నటేష్) ని చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఓ పొలిటీషియన్ కాశి రెడ్డి ని చంపిన కేసులో రామ్ ను జైల్లో వేస్తారు. అక్కడి నుండి తప్పించుకుంటాడు . జైలు నుండి తప్పించుకున్న శంకర్ మెదడు లోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్ ప్లాంట్ చేస్తుంది సైన్టిస్ట్ పింకీ (నిధి అగర్వాల్ ). పొలిటీషియన్ కాశీరెడ్డిని శంకరే చంపాడా? శంకర్‌కి సీబీఐ ఆఫీసర్‌ అరుణ్‌ (సత్యదేవ్‌)కి సంబంధం ఏంటి? వాటిని శంకర్ తలలోకే ఎందుకు ఎక్కించారు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

విశ్లేషణ:

పూరీ గురించి సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక హీరోని.. హీరోలాగా చూపించాలంటే తన తరువాతే ఎవరైనా. ఎంతో మంది హీరోలు ఒకే మూస ధోరణిలో కొట్టుకుపోతుంటే వారిలోని మరో యాంగిల్ ను తెలుగు తెరకు పరిచయం చేసే డైరెక్టర్. అలాంటి పూరీ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఈ మధ్య కాస్త వెనుబడ్డాడు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని వచ్చినట్టుంది ఇస్మార్ట్ శంకర్ చూస్తుంటే. ఫుల్ మాస్ మసాలా సినిమాను తీశాడు. ఇక ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తన పాత లైన్ ను మాత్రం మార్చలేదు. ఓ పాట, ఓ ఫైట్ అన్న ఫార్ములాకు తన మార్క్‌ టేకింగ్‌ను జోడించి సినిమాను తెరకెక్కించాడు. కథ కొత్తగా ఉన్నా కథనం విషయంలో మాత్రం తన రొటీన్‌ స్టైల్‌నే ఫాలో అయ్యాడు.


ఇక ఈసినిమా హైలెట్ రామ్ నటన. కొత్త మేకోవర్ తో.. కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఫుల్ క్యారెక్టర్ లో శంకర్ తన పాత్రలో తాను ఒదిగిపోయాడు. కొంచెం పట్టి పట్టి తెలంగాణ యాసను మాట్లాడినట్టు అనిపించినా ఓవరాల్ గా మాత్రం ఈ సినిమాలో హైలెట్ రామే. హీరోయిన్ ల విషయానికి వస్తే నిధి అగర్వాల్ , నభా నటేష్ లు ఇద్దరు కూడా గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకున్నారు. నభా నటేష్ కూడా తెలంగాణ యాసలో మాట్లాడి మరోసారి తన మార్క్ ను చూపించింది. సత్యదేవ్‌ కు మరో గుర్తుండిపోయే పాత్ర దక్కింది. కనిపించింది కొద్దిసేపైనా గుర్తుండిపోయే పాత్రలో అలరించాడు. షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి తమకు అలవాటైన పాత్రల్లో ఈజీగా నటించారు.

మణిశర్మ మ్యూజిక్‌ సినిమాకు ప్రధానబలం. తన మ్యూజిక్‌తో ప్రతీ సీన్‌ను మరింతగా ఎలివేట్ చేశాడు. అలాగే సినిమా నేపధ్యానికి తగ్గట్లుగా, సినిమాలోని వచ్చే పరిస్థితులకు తగట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు. రాజ్ తోట కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా పక్కా మాస్ ఆడియన్స్ కు మాత్రం అని చెప్పొచ్చు. ఏ సెంటర్ ఆడియన్స్ కు ఎలా నచ్చుతుందో చూడాలి..

ప్లస్‌ పాయింట్స్‌ :
రామ్‌ నటన
మాస్ ఎలిమెంట్స్‌
మ్యూజిక్

మైనస్‌ పాయింట్స్‌ :
రొటీన్ లైన్
స్క్రీన్‌ ప్లే

 

ఇస్మార్ట్ శంకర్ తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screen Play
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

[subscribe]

[youtube_video videoid=XBrORKG0lUw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =