సామాజిక బాధ్యత నేర్పుతున్న మహానటి డైరెక్టర్

2019 Latest Telugu Movie News, Mahanati Director Nag Ashwin Online Social Challenge, Social Challenge By Director Nag Ashwin, Mahanati Director Nag Ashwin Challenge On Water Crisis, Nag Ashwin Says To Save Water, Nag Ashwin Social Challenge On Water Crisis, Nag Ashwin Latest Movie News, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Mahanati Director Nag Ashwin Online Social Challenge

మహానటి సినిమాతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్.. సామాజిక బాధ్యత నేర్పుతున్నాడు. అందేంటీ అనుకుంటున్నారా..? ఇటీవల కాలంలో మనం చాలా రకాల చాలెంజ్ లు వినే ఉంటాం.. ఐస్ బకెట్ ఛాలెంజ్, కికి ఛాలెంజ్.. ఈ మధ్య బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజ్ లు సోషల్ మీడియా వేదికగా హల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి నాగ్ అశ్విన్ వన్ బకెట్ ఛాలెంజ్ ను తీసుకొస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో నీటి కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది నీటి కొరతతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ దీనికి పరిష్కారంగా ఓ వినూత్నంగా ‘వన్ బకెట్’ ఛాలెంజ్ ని ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. కనీసం ఒక్కరోజైనా కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించి దిన చర్య ముగించాలని పిలుపునిస్తున్నారు. దానికి ఒక డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జులై 21 న కేవలం ఒక బకెట్ నీటిని మాత్రమే ఉపయోగించి వాటర్ ను సేవ్ చేయమని పిలుపునిస్తున్నారు.

మరి ఐస్ బకెట్ లాంటి ఛాలెంజ్ లను అయితే మనవాళ్లు చాలా సీరియస్ గా తీసుకొని చేశారు.. మరి ఈ వన్ బకెట్ ఛాలెంజ్ ను ఎంత వరకూ సీరియస్ గా తీసుకుంటారో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=-f4uV7KLUUs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 5 =