విజయ్ ను నానీ బీట్ చేయడం ఏంటీ.. ఏ విషయంలో నాని విజయ్ ను బీట్ చేశాడు అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని. ఇక తన బోల్డ్ యాటిట్యూడ్ తో.. వరుస హిట్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 26వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా నైజాంలో 7.1కోట్లకు అమ్ముడు పోయింది.
ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉన్న ఈసినిమా ఫస్ట్ లుక్ ను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేశారు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాని మంచి హ్యూమర్ ను పండిస్తాడన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. వచ్చే నెల 30వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా నైజాంలో 8.5 కోట్లకు అమ్ముడుపోయాయి. మరి నాని అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో కాబట్టి అన్నికోట్లు పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదని చెప్పొచ్చు.
[youtube_video videoid=3DUXiGluVjo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: