చిత్రలహరి మూవీ విజయోత్సాహం తో హీరో సాయి ధరమ్ తేజ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గీతా ఆర్ట్స్ 2 , UV క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరో గా ప్రతి రోజూ పండగే మూవీ ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమం జరుపుకొంది. అందాల తార రాశీఖన్నా కథానాయిక కాగా తమిళ నటుడు సత్య రాజ్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ప్రతి రోజూ పండగే మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ 27వ తేదీ ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కామెడీ జోనర్ లో రూపొందించిన దర్శకుడు మారుతి ప్రతి రోజూ పండగే మూవీ ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పూర్తి ఎమోషనల్ మూవీ గా తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రతి రోజూ పండగే మూవీ కి థమన్ SS సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ టైటిల్ తో రూపొందనున్న ప్రతి రోజూ పండగే మూవీ హీరో సాయి ధరమ్ తేజ్ కు సక్సెస్ ఫుల్ మూవీ గా మారాలని కోరుకుందాం.
[youtube_video videoid=nuK-vmPxlvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: