‘సరిలేరు నీకెవ్వ‌రు`… త‌న పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన విజ‌య‌శాంతి

Vijaya Shanthi Reveals her Character in Sarileru Neekevvaru,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijaya Shanthi Upcoming Movie News,Vijaya Shanthi Next Film Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,#SarileruNeekevvaru
Vijaya Shanthi Reveals her Character in Sarileru Neekevvaru

లేడీ సూప‌ర్‌స్టార్ విజయశాంతి… నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక‌. ఒక‌వైపు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మురిపిస్తూనే… మ‌రోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌తోనూ మెప్పించిన వైనం ఆమె సొంతం. ఒక ద‌శ‌లో అగ్ర క‌థానాయ‌కుల సినిమాల్లోనూ వారికి ధీటుగా ఉండే పాత్ర‌ల్లో న‌టించ‌డ‌మే కాదు… వారి స్థాయిలోనే పారితోషికాన్ని కూడా అందుకున్న ఘ‌న‌త విజ‌య‌శాంతిది. క్రియాశీల‌క రాజ‌కీయాలతో బిజీగా ఉండి సినిమాలకు దూరమైన రాములమ్మ… దాదాపు 13 ఏళ్ళ త‌రువాత‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్న‌ సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కు అత్త‌గా విజయశాంతి నటించనున్నారని ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. అయితే… తాజాగా ఇదే విష‌యాన్ని విజ‌య‌శాంతి వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా… ఈ చిత్రంలో మహేష్‌కు అత్త‌గా న‌టించ‌డం లేద‌నీ, అస‌లు త‌మ పాత్ర‌ల‌ మధ్య ఎటువంటి రిలేషన్ ఉండ‌దనీ, ఇద్దరి పాత్రలు స‌మాంత‌రంగా సాగే పాత్ర‌ల‌ని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో తనది పూర్తిగా పాజిటివ్ రోల్‌ అని, నెగటివ్ క్యారెక్ట‌ర్స్‌కు తను దూరమని చెబుతూనే… తన పాత్ర తీరు తెన్నులపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని పేర్కొన్నారు లేడీ అమితాబ్‌.

మొత్తానికి హీరోతో పాటు సమాన ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌తోనే రీ-ఎంట్రీ ఇస్తూ… ఇప్పటికీ తన ఛ‌రిష్మా ఏ మాత్రం తగ్గలేదని చెప్ప‌క‌నే చెబుతున్నారు విజ‌య‌శాంతి.

కాగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హిలేరియ‌స్ ఎంటర్‌టైనర్‌… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=RQv2OFfXiXc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =